ఏపీకి వెళ్లి జగన్ కు మద్దతిస్తా: అసదుద్దీన్

  • చంద్రబాబుకు సొంత రాష్ట్రంలోనే వ్యతిరేకత ఉంది
  • ఈసారి రెండు ఎంపీ స్థానాలు కూడా గెలవలేరు
  • నేను ప్రచారం చేస్తే ప్రభావం ఎలా ఉంటుందో బాబుకు తెలుస్తుంది
ఏపీకి వెళ్లి జగన్ కు మద్దతిస్తానని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుకు తన సొంత రాష్ట్రంలోనే వ్యతిరేకత ఉందని, ఈసారి రెండు ఎంపీ స్థానాలు కూడా గెలవలేరని జోస్యం చెప్పారు. ఏపీలో తాను ప్రచారం చేస్తే, ప్రభావం ఎలా ఉంటుందో చంద్రబాబుకు తెలుస్తుందని అన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసినా తెలంగాణలో చంద్రబాబు ఫలితాలు సాధించలేకపోయారని అన్నారు. 
Go Back to Shorts
Andhra Pradesh
jagan
Asaduddin Owaisi

More Telugu News